శ్రీ అగస్త్యేశ్వరస్వామి ఆలయం , నారాయణవనం :
తిరుమల పరిసర ప్రాంతాలలో సాక్షాత్తు శ్రీనివాసుడు తిరుగాడిన ప్రదేశాలు చాలా వున్నాయి,
వాటిలో ముఖ్యమైనది "నారాయణ వనం". వేంకటాచల క్షేత్రం తర్వాత శ్రీనివాసుడు కాలుపెట్టిన
పవిత్ర భూమి ఈ పురం. ఈ నారాయణవనం ఒకప్పుడు ఒక మహా నగరం, ఆకాశరాజు పరిపాలించిన రాజ్యం.
ఈ నారాయణవనం లోనే వేటకై వచ్చిన శ్రీనివాసుడు చెలికత్తెలతో వన విహారానికై వచ్చిన పద్మావతి ని చూసి మోహించాడు. పద్మావతి కూడా శ్రీనివాసుని చూసి మొహితురలై తాప జ్వర పీడితురాలైతుంది. ఆమె జ్వరం తగ్గుటకు ఆస్థాన పండితులు ఈ నారాయణవనం లోని
శ్రీ అగస్త్యేశ్వర స్వామి వారికి అభిషేకం జరిపించి ఆ తీర్థం సేవిస్తే ఈ భాధ తగ్గుతుంది అని సలహా ఇవ్వడంతో ఆకాశరాజు ఈ ఆలయం లోని శివలింగానికి అభిషేకం జరిపించగా ఆమె కు
వెంటనే జ్వరం తగ్గుతుంది.
అంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యం లో వున్నది. నారాయణవనం శ్రీ కళ్యాణవేంకటేశ్వరుని కి అతి సమీపం లో చక్కని పల్లె వాతావరణం లో ఉన్న ఈ అగస్త్యేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించండి , ఆనాడు సాక్షాత్తు పద్మావతి దేవి అభిషేకం జరిపించిన ఈ శివలింగానికి మనం కూడా అభిషేకం జరిపించుకొనే
భాగ్యం ఈ కాలంలో మనకి కూడా ఉండడం మన అదృష్టంగా భావిద్దాం.
అసలు ఈ నారాయణవనం లో ఈ శివలింగ ఆవిర్భావం ఎలా జరిగింది? అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియో లో చూడండి.
No comments:
Post a Comment