Search This Blog

Saturday, November 18, 2017

నారాయణ వనం - NarayanaVanam


నారాయణ వనం:

     సాక్షాతూ శ్రీ పద్మావతి అమ్మవారు బంగారు పద్మం లో ఆవిర్భవించిన పుణ్య ధామం నారాయణ వనం. ఏడుకొండల వాడు "ఎరుకలసాని " గా తిరుగాడిన పవిత్రమైన తిరువీదులు ఉన్న పురం నారాయణవనం . లోకకళ్యాణం కోసం పద్మావతి శ్రీనివాసులు భూలోకం లో పరిణయమాడిన పురం ఈ నారాయణవనం.
      తిరుమల యాత్ర లో తప్పక దర్శించాల్సిన ఆలయం ఈ నారాయణపురం కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం. ఈ ఆలయ ప్రాంగణం లోనే ఆనాడు ముక్కోటి దేవతల సమక్షంలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం అంగరంగ వైభవం గా జరిగింది. ఈ ఆలయ ప్రాంగణం సువిశాలంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడి మూల విరాట్టు కుడి చేతికి కళ్యాణ కంకణం మరియు ఎడమ చేతిలో వేట ఖడ్గం ధరించి ఉంటారు. ప్రాంగణం లోపల పద్మం లో కుర్చుని ఉన్న పద్మావతి అమ్మవారి ఆలయం ఉంది.
     అంతే కాదు ఇక్కడ అమ్మవారి కళ్యాణ సమయంలో నలుగు పిండి విసిరిన తిరగలిని ఇప్పటికి చూడొచ్చు. ఈ ఆలయానికి సమీపం లోనే అవనాక్షి అమ్మవారి గుడి , శ్రీ అగస్త్యేశ్వరస్వామి ఆలయం కూడా వున్నాయి.
     పెళ్లి కావలసిన అమ్మాయిలు, అబ్బాయిలు, లేదా వారి తల్లిదండ్రులు ఇక్కడి స్వామి అమ్మవార్లను దర్శించి ప్రార్ధిస్తే అతి త్వరలో వివాహం జరుగుతుంది అని ప్రతీతి.
కేవలం దర్శన మాత్రముచే వివాహం, సంతానం, ఐశ్వర్యం అందించే నారాయణపురం లోని శ్రీ పద్మావతి కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారిని గురించి మరిన్ని అద్భుత విషయాల కొరకు ఈ వీడియో చూడండి.


No comments:

Post a Comment

శ్రీ మహాలక్ష్మినే ఒక చెట్టుకి భందించిన అనంతాళ్వార్: #ananthaalwar , #ananthalwar , #poulathota , అనంతాళ్వార్ భగవద్ రామానుజుల గ...