గోదాదేవి (ఆండాళ్ ) చరిత్ర:
ధనుర్మాసం అనగానే అందరికి వెంటనే స్పురించేది గోదాదేవి మరియు ఆమె పాడిన తిరుప్పావై పాశురాలు. అన్ని విష్ణువాలయాల్లో ఈ ధనుర్మాసం చాలా ప్రత్యేకం, నిత్యం శ్రీవారికి జరిపే సుప్రభాత స్థానం లో గోదాదేవి రచించిన తిరుప్పావై పాశురాలను రోజుకొక్క పాశురం చొప్పున ఈ మాసం మొత్తం పఠిస్తారు.
సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా ప్రఖ్యాతి వహించిన విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు రచించిన తెలుగు ప్రబంధం "ఆముక్తమాల్యద" గ్రంథం. దీనికే "విష్ణుచిత్తీయం" అని మరోపేరు. ఇది తెలుగు సాహిత్యంలో పంచకావ్యాలులో ఒకటిగా ప్రసిద్ధిచెందినది. ఈ గ్రంథం లో ప్రధానమైన కథ గోదాదేవి మరియు శ్రీరంగేశుల కల్యాణం.
12 మంది ఆళ్వార్ లలో ఒకరైన ఈ గోదాదేవి ఎవరు? ఆమె ఏ ప్రాంతం లో జన్మించింది ?
మున్నగు ఆసక్తికర విషయాలు ఈ వీడియో లో వివరించడమయినది .
No comments:
Post a Comment