శ్రీ మహాలక్ష్మినే ఒక చెట్టుకి భందించిన అనంతాళ్వార్:
#ananthaalwar, #ananthalwar, #poulathota,
అనంతాళ్వార్ భగవద్ రామానుజుల గారి శిష్యుడు, వారి కోరిక పై తిరుమల నంబి గారి తర్వాత తిరుమల లో స్వామి కి కావలసిన పుష్ప కైంకర్యమునకై తన భార్య తో కూడి తిరుమల వెళ్లి అచటనే ఉంటూ పూల మాలలను కడుతూ స్వామి కైంకర్యము లలో పాలు పంచుకునేవారు.
అనంతళ్వార్ స్వయంగా ఒక చెరువు ను కూడా తవ్వి ఆ నీటితో స్వామి కైంకర్యము నకు కావలసిన పూల తోట కు వినియోగించేవారు. ఆ చెరువును మరియు అనంతళ్వార్ నివాస గృహాన్ని ఇప్పటికి మనం శ్రీవారి ఆలయ మహాప్రదక్షిణ మార్గం లో సరిగ్గా నైరుతి మూల లో చూడవచ్చు .
పుష్ప ప్రియుడైన శ్రీవారు అనంతళ్వార్ ని మెచ్చి అనుగ్రహింపదలచి అలివేలుమంగ తో కలసి ఆ తోటకు విచ్చేయగా అనంతళ్వార్ శ్రీ మహాలక్ష్మి ని ఒక చెట్టుకు భంధించి, పిమ్మట స్వామి ని కూడా భందింప దలచి వెంటపడగా స్వామి వారు తప్పించుకొని అప్రదక్షణం గా ఆలయం లోనికి వెళ్ళిరి. అసలు అనంతాళ్వార్ వీరిని భంధించడానికి గల కారణం ఏమిటి? స్వామి ఏ విధం గా అనుగ్రహించిరో ఈ వీడియో లో చూడండి.
No comments:
Post a Comment